Amaravati, Feb 25: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి అయిదు నగరాలకు సర్వీసులు (IndiGo to start flights) నడపనుంది. వీటిలో మార్చి 27 నుంచి (five cities from Mar 27) చెన్నై, విజయవాడ, హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సర్వీసులు అందిస్తున్న నగరాల్లో కడప 73వది.
కరోనావైరస్ విలయతాండవం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. కరోనా నుంచి కోలుకునే సమయంలోనే ఫ్యూయల్ ధరల పిడుగుపడింది. దీంతో ఏవియేషన్ సెక్టార్ ఇప్పుడప్పుడే గాడిన పడదు అనే వాదనలు వినిపించాయి. కానీ కడప లాంటి టైర్ త్రీ సిటీస్‌లో కూడా తిరిగి విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్ సెక్టార్ త్వరగా కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఏపీలో కొత్తగా 220 మందికి కరోనా, ఇంకా 4,927 మందికి కొనసాగుతున్న చికిత్స
వచ్చే నెలలో జరగనున్న ఏపీ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు డుమ్మా కొట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, టీడీపీ ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం పాల్గొంటారు. ఈ సమావేశాల్లో పాల్గొనాలా? వద్దా? అనే విషయమై నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడమే మంచిదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది.
రాష్ట్రం అనేక సమస్యల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి వీటన్నింటినీ సమావేశాల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే, తాము హాజరైనంత మాత్రాన మాట్లాడే అవకాశం ఇస్తారన్న నమ్మకం కూడా లేదని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. కాగా, గతేడాది నవంబరులో సాక్షాత్తూ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రబాబు సమావేశాల్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు.