Amarawathi, SEP 28: 27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు(MLAs) క్లాస్ పీకారు సీఎం జగన్ (CM Jagan). పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 27మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath), తానేటి వనిత.. మాజీమంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆళ్ల నాని (Alla Nani) తీరు మారాలని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన ఫైర్ అయ్యారు. పేర్లు ప్రస్తావించి మరీ వారికి క్లాస్ పీకారు జగన్. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లే టార్గెట్ గా సాగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు జగన్.
నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో వారసులను పోటీలోకి దింపేందుకు కొంతమంది సీనియర్ నేతలు, మంత్రులు, మాజీమంత్రులు ప్రయత్నిస్తూ ఉండటంతో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి వారసులను పోటీలోకి దింపొద్దని సీఎం జగన్ చెప్పారు. మంత్రులు, మాజీమంత్రులు అందరూ పోటీ చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. నవంబర్ లో మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
27 మంది ఎమ్మెల్యేలు 16 రోజుల్లోపు మాత్రమే తిరిగారు. మంత్రులు బుగ్గన, తానేటి వనిత పనితీరు బాగోలేదు. మాజీ మంత్రులు బాలినేని, ఆళ్ల నాని పనితీరుపై జగన్ అసంతృప్తి. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. దొంగదారులు వెతకొద్దని హెచ్చరించారు సీఎం జగన్. పనితీరు ఆధారంగా ఎన్నికలకు 6 నెలల ముందు మార్పులుంటాయని నేతలకు చెప్పారు జగన్.