Jio launches 'Work From Home Pack' for Rs 251 (Photo-Ians)

Tirupati, Oct 28: ఏపీలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌(ఎల్రక్టానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌–2)లో ఉన్న యునైటెడ్‌ టెలీలింక్స్‌ నియోలింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి జియో నెక్ట్స్‌ ఫోన్ల (JioPhone Next smartphones ) తయారీకి శ్రీకారం చుట్టింది. ప్రాథమికంగా రూ.20కోట్ల పెట్టుబడి పెట్టిన రిలయన్స్‌ సంస్థ త్వరలోనే భారీ పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించింది. మొబైల్‌ ఫోన్లు, టెలికాం, కంప్యూటర్‌ పరికరాలు, ఎల్రక్టానిక్‌ ఉత్పత్తుల తయారీని (Neolinks plant in Tirupati) చేపట్టనున్నట్టు సంస్థ పేర్కొంది.

జియో ఫోన్‌ నెక్ట్స్‌ కోసం ఆండ్రాయిడ్‌ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి చేసింది. క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్‌ ఫోన్‌లో పొందుపరిచారు. 10 భాషలను అనువదించే ఫీచర్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులోని రీడ్‌ అలౌడ్‌ ఫంక్షన్‌ స్క్రీన్‌పై తెరచిన యాప్‌లో ఉన్న కంటెంట్‌ను బిగ్గరగా చదువుతుంది. వాయిస్‌ అసిస్టెంట్‌తో ఫోన్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. ఇంటర్నెట్‌ నుంచి కావాల్సిన సమాచారం పొందవచ్చు. సాఫ్ట్‌వేర్‌ దానంతట అదే అప్‌డేట్‌ అవుతుందని సంస్థ వెల్లడించింది.

ఏపీకి భారీ వర్ష సూచన, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, పలు జిల్లాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు

తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌ వద్ద ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూపునకు చెందిన నియో లింక్స్‌ ప్లాంట్‌లో మదర్‌బోర్డ్‌ ఒక్కటే తయారవుతుండగా, రేణిగుంటలోని ప్లాంట్‌లో మదర్‌బోర్డ్‌ సహా ఫోన్‌ మొత్తం తయారవుతుండడం విశేషం. జియో ఫోన్‌ నెక్ట్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ దీపావళి నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతిలోని ప్లాంట్‌లో నెలకు సగటున ఐదులక్షల ఫోన్లను తయారు చేస్తున్నామని నియోలింక్స్‌ ప్లాంట్‌ జనరల్‌ మేనేజర్‌ సాయి సుబ్రమణ్యం తెలిపారు. ఫోన్ల తయారీలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న ట్లు వెల్లడించారు.