
Kurnool, Sep 1: కర్నూలులో చాగలమర్రిలో పొలం విషయంలో సీఎం కార్యాలయం హామీ ఇచ్చినప్పటికీ... తమకు న్యాయం జరిగేలా లేదని ఆందోళనకు గురైన అక్బర్ బాషా కుటుంబం (Akbar Basha Family Attempts Suicide) సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. అక్బర్‌తోపాటు భార్య ఖాసీంబీ, కుమార్తెలు ఆసిఫా, ఆసిన్ పురుగుల మందు తాగారు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో వారి పరిస్థితిని గుర్తించిన బంధువులు చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం (Kurnool Akbar Basha family) నిలకడగా ఉంది.
కాగా భూమి విషయంలో అన్యాయం జరుగుతోందని పోలీసులను ఆశ్రయిస్తే... ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారంటూ అక్బర్‌బాషా ఈనెల 11న పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.ఈ సెల్ఫీ వీడియోపై సీఎం కార్యాలయ అధికారులు స్పందించి... హామీ ఇచ్చినా, తమకు న్యాయం జరిగేలా లేదని ( after govt intervention) సోమవారం అక్బర్ కుటుంబీకులంతా పురుగుమందు తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బర్‌బాషా మాట్లాడుతూ ‘మా భూమి మాకు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా కొందరు అడ్డుపడుతున్నారు.
మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దువ్వూరుకు చెందిన తిరుపాల్ రెడ్డి, మేయర్ సురేష్‌బాబు హెచ్చరించారు. అంతే కాకుండా పంచాయతీ చేసి రూ.10 లక్షలు కడితే నీ పత్రాలు నీకిస్తామంటూ బెదిరించారని చెప్పారు. గడువులోగానే డబ్బులను సమకూర్చుకుని వారి దగ్గరికి వెళ్లగా నాలుగైదు రోజులుగా ముఖం చాటేస్తున్నారని వాపోయారు. ఈ భూమిపై ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. యర్రబల్లిలోని 1.50 ఎకరాల భూమి అక్బర్ బాషాది కాదు.. అతని అత్త కాశీంబీదని మైదుకూరు కోర్టు 2018లో తీర్పు ఇచ్చిందని ఎస్పీ అన్బురాజన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మైదుకూరు కోర్టు తీర్పుపై ఇంతవరకూ ఎవరూ హైకోర్టుకు వెళ్లలేదన్నారు.