Hyderabad, Nov 9: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ (Lady Aghori) ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. తాజాగా ఆమె యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. కుంభమేళా ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు అక్కడికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తానని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తన పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు.
Here's Video:
మహానంది క్షేత్రాన్ని దర్శించుకున్న అఘోరి
ఆలయ మర్యాదలతో అఘోరికి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించిన అధికారులు#Mahanandi #ladyaghori #Bigtv https://t.co/pQrVijzwXN pic.twitter.com/8u2AdsfigN
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2024
యాగంటి క్షేత్రంలో అఘోరి ప్రత్యక్షం
లోక కళ్యాణం చేయడానికి మాత్రమే వచ్చాను: అఘోరి
ఎంత మంది ఎన్ని విమర్శించినా నా పోరాటం ఆగదు
సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం
కుంభమేళా ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు అక్కడికి వెళ్లి మళ్లీ వస్తాను
ఒక్క రాష్ట్రంలోనే కాదు.. అన్ని… pic.twitter.com/C5ZTmHUfa1
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2024
యాగంటి దర్శనానంతరం మహానందికి
యాగంటి దర్శనానంతరం అఘోరీ మహానందికి బయలుదేరారు. ఆలయ మర్యాదలతో అఘోరీకి స్వామి, అమ్మవార్ల దర్శనాన్ని అధికారులు కల్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.