Rains (Photo-Twitter)

నేడు అండమాన్‌ సముద్రా­నికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా పయనించి అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈనెల 23 నుంచి రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది.

ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, అల్పపీడనం ప్రభావంతో పొంచి ఉన్న తుఫాను ముప్పు, మళ్లీ భారీ వర్షాలు తప్పవని హెచ్చరిక

కాగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ మచిలీపట్నం, కర్నూలు మీదుగా పయనిస్తున్నది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా నిష్క్రమించే పరిస్థితులున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకున్న వెనువెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

ఇందుకు బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం వంటివి ఏర్పడితే మరింత అనుకూలతకు దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 20న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని చెబుతున్నారు. అనంతరం రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని వీరు పేర్కొంటున్నారు.

తేజ్ తుఫానుపై ఐఎండీ భారీ హెచ్చరిక, అరేబియా సముద్రంలో సైక్లోన్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఏంటంటే..

దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగానే నిష్క్రమించాయి. ఇక, దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. నైరుతి తగినంత వర్షపాతం ఇవ్వని నేపథ్యంలో, పలు రాష్ట్రాలు ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వస్తూనే అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తున్నాయి.