Cyclone (Photo Credits: Wikimedia Commons)

Amaravati, Oct 9: ఏపీకి మరో తుఫాన్ ముప్పు(Cyclone Alert in AP) పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు చెబుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) (Indian Meteorological Department) ఇప్పటికే ప్రకటించింది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర వైపు పయనిస్తూ 12వ తేదీన మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఆపై మరింత బలపడి ఈ నెల 13, 14 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇది తుపానుగా మారితే పూరీ నుంచి మచిలీపట్నం మధ్య ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఈ నెల 15న తీరం దాటే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.10న ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుపానుగా మారినా, వాయుగుండానికే పరిమితమైనా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఎవరూ బయటకు రాకండి, రానున్న రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, హెచ్చరించిన వాతావరణ శాఖ

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. రాగల రెండు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని భాగాల నుంచి తిరోగమించనున్నాయని ఐఎండీ వెల్లడించింది. వీటి ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి.

పేదలందరికీ ఇళ్లు పథకానికి హైకోర్టు బ్రేక్, కోర్టు చెప్పిన ముఖ్యమైన కారణాలు ఇవే, తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ఆదివారం ఏర్పడనున్నఅల్పపీడనం (Low pressure predicted) వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా బలపడితే జావద్‌గా నామకరణం చేస్తారు. ఇది అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశముందని తెలుస్తోంది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీగా వర్షాలు పడుతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది తుపానుగా మారినా, లేదంటే వాయుగుండానికే పరిమితమైనా... ఉత్తర కోస్తాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.