Amaravati, Feb 12: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక సమావేశం (MHA Crucial Meeting) ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ఫిబ్రవరి 17న జరగనుంది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారించడానికి, ఆచరణాత్మక మార్గాలను సిఫార్సు చేయనున్నారు,
కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి కమిటీ ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 3.30 గంటలకు తన మొదటి సమావేశాన్ని (MHA to hold crucial meeting) నిర్వహించనుంది. కాగా ఈ కమిటీలో ఎంహెచ్‌ఏ జాయింట్ సెక్రటరీ (కేంద్ర-రాష్ట్రం) ఆశిష్ కుమార్, తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్) ఎస్‌ఎస్ రావత్ సభ్యులుగా ఉన్నారు. MHA డైరెక్టర్ రేణు సరిన్ ప్రకారం, సమావేశం యొక్క ఎజెండాను నిర్ణీత సమయంలో పంచుకోబడుతుందని తెలిపారు.
ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. జనవరి మొదటివారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన సమస్యలు (discuss bilateral issues between Telangana, Andhra Pradesh) పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
త్రిసభ్య కమిటీ ఎజెండాలో 9 అంశాలు...
ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం
ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం
ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
ఎజెండా 5: ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన
ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు
ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు