YS Avinash Reddy (photo-Video Grab)

Kadapa, April 27: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్యకు సంబంధించి ఎంపీ అవినాష్‌ రెడ్డి ఓ వీడియో రిలీజ్‌ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్‌ రెడ్డి వీడియోను విడుదల చేశారు. వీడియోలో వివేకా లెటర్‌ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్‌ పెట్టడం లేదు?. సీబీఐ అధికారి రాంసింగ్‌ ఎవరిని కాపాడుతున్నారు?. ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు?.

వివేకా హత్య కేసులో మరో మలుపు, ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసిన హైకోర్టు, లొంగిపోకపోతే అరెస్ట్ చేసుకోవచ్చని సీబీఐకి సూచన

వివేకా హత్య తర్వాత శివప్రకాష్‌ రెడ్డి నాకు ఫోన్‌ చేశారు. వివేకా మరణించినట్టు శివప్రకాష్‌ రెడ్డే నాకు చెప్పారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని వివేకా పీఏ కృష్ణారెడ్డిని అడిగాను. ఎలాంటి అనుమానాలు లేవని వివేకా పీఏ చెప్పారు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని లెటర్‌లో రాశారు.

Here's Video

సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలి. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దనే.. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నామని వీడియోలో స్పష్టం చేశారు.