Mudragada Padmanabham Becoming Padmanabha Reddy: 2024 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చిన కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎన్నికల్లో పవన్‌ని ఓడించకుంటే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. నేటికి కట్ చేస్తే, జనసేన 21/21 ఎమ్మెల్యే సీట్లు, 2/2 ఎంపీ సీట్లు గెలుచుకోగా, వైసీపీ 11/175, 4/25 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఈ ఘోర పరాజయాన్ని దృష్టిలో ఉంచుకుని ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన ప్రకటన చేశారు.
తన ఓటమిని అంగీకరించిన ముద్రగడ తన పేరు మార్చుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. “పవన్ కళ్యాణ్ గారిని ఓడించే ఛాలెంజ్‌లో నేను ఓడిపోయాను అనేది నిజం. మాట మీద నిలబడి నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, సీఎం జగన్ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడి
పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు.
కాగా, పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే. అన్న మాట ప్రకారమే ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నారు. అటు ఎన్నికల ఫలితాలపై ముద్రగడ స్పందించారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని పేర్కొన్నారు. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే.. రాబోయే రోజుల్లో ఏ సీఎం కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిపొందిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.