Amaravati, April 4: ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్లు జారీ చేయగా నేడు సీఎం జగన్ అధికారికంగా కొత్త జిల్లాలను (New Districts in AP) లాంచ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాతో తొలి నోటిఫికేషన్ జారీ అయ్యింది. తర్వాత ఒక్కో జిల్లాకు ఒక్కోటి చొప్పున నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థూలంగా నిర్ణయించుకుని.. విస్తీర్ణం దృష్ట్యా అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. 13 జిల్లాలను 26కు పెంచింది. కొత్త జిల్లాలతో ఏపీలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కు చేరింది. ఏపీలో కొత్తగా 21 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుంచి 73కు పెంచారు. విజయవాడ కేంద్రంగానే కృష్ణా జిల్లా ఏర్పాటు ఉండనుంది. కుప్పం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను (Collectors, SPs appointed for new districts) నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రభుత్వం మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12 వేల 600 అభ్యంతరాలు వచ్చాయి. వచ్చిన సూచనల మేరకు స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది. కొన్ని జిల్లాల పరిధిలోని మండలాల్లో కొన్ని సవరణలు జరిగాయి. అలాగే.. ప్రాథమిక నోటిఫికేషన్లలోని కొన్ని జిల్లాల పేర్లలో చిన్న సవరణలు చేశారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించారు. దీనిని ఇప్పుడు తిరుపతి జిల్లాగానే ఉంచారు. అలాగే… మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం మన్యం అనే పేరు ఖరారు చేశారు.
26 జిల్లాలకు కలెక్టర్లు
శ్రీకాకుళం కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావ్
విజయనగరం కలెక్టర్‌గా సూర్యకుమారి
మన్యం కలెక్టర్‌గా నిషాంత్ కుమార్
విశాఖ కలెక్టర్‌గా మల్లికార్జున్
అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌గా సుమిత్ కుమార్
అనకాపల్లి కలెక్టర్‌గా రవి సుభాష్
కాకినాడ కలెక్టర్‌గా కృతికా శుక్లా
తూర్పు గోదావరి కలెక్టర్‌గా మాధవీలత
కోనసీమ కలెక్టర్‌గా హిమాన్ష్ శుక్లా
పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా ప్రశాంతి
ఏలూరు కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్
కృష్ణా కలెక్టర్‌గా రంజిత్ భాషా
ఎన్టీఆర్ కలెక్టర్‌గా ఎస్.దిల్లీరావు
గుంటూరు కలెక్టర్‌గా ఎమ్.వేణుగోపాల్‌రెడ్డి
పల్నాడు కలెక్టర్‌గా శివశంకర్ లతోటి
బాపట్ల కలెక్టర్‌గా కె.విజయ
ప్రకాశం కలెక్టర్‌గా దినేశ్ కుమార్
నెల్లూరు కలెక్టర్‌గా కేవీఎన్ చక్రధరబాబు
తిరుపతి కలెక్టర్‌గా కే.వెంకటరమణారెడ్డి
చిత్తూరు కలెక్టర్‌గా హరినారాయణ్
అన్నమయ్య కలెక్టర్‌గా గిరీష
వైఎస్‌ఆర్ కడప కలెక్టర్‌గా విజయరామరాజు
సత్యసాయి కలెక్టర్‌గా బసంత్ కుమార్
అనంతపురం కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి
నంద్యాల కలెక్టర్‌గా మంజీర్ జిలానీ శామూన్
కర్నూలు కలెక్టర్‌గా కోటేశ్వరరావు
కొత్త జిల్లాల్లో పాలన మొదలుకానుండడంతో… ఆయా జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. కొందరు కలెక్టర్లు, ఎస్పీలను మాత్రం పాత జిల్లాల్లో యథాతథంగా కొనసాగించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు తాజాగా కలెక్టర్ పోస్టులు దక్కాయి. పలు చోట్ల నగర కమిషనర్లుగా, ఇతర బాధ్యతల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు కలెక్టర్ హోదా దక్కింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్, అనకాపల్లి జిల్లాకు రవి సుభాష్, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా, తూర్పుగోదావరి జిల్లాకు మాధవీలత, కోనసీమ జిల్లాకు హిమాన్షు శుక్లా, పశ్చిమ గోదావరి జిల్లా పి.ప్రశాంతి, ఏలూరుకు ప్రసన్న వెంకటేశ్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లు వారి స్థానాల్లో యధావిధిగా కొనసాగుతారని తెలిపింది.
26 కొత్త జిల్లాలకు ఎస్పీలను కూడా నియమించిన ఏపీ సర్కార్… మొత్తం 51 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. సీఐడీ ఎస్పీగా అమిత్ బర్దర్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా మనీశ్‌కుమార్ సిన్హా, రైల్వే డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా, టీటీడీ విజిలెన్స్ ఎస్పీగా నరసింహా కిశోర్ ను నియమించింది. ఇక కొత్త జిల్లాలైన అనకాపల్లి ఎస్పీగా గౌతమి, పార్వతీపురం ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీష్‌కుమార్, కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ ఎస్పీగా సుబ్బారెడ్డి, ఏలూరు ఎస్పీగా అమ్మిరెడ్డి, విశాఖ సీపీగా సీహెచ్ శ్రీకాంత్, విజయవాడ సీపీగా క్రాంతి రాణా టాటాను నియమించింది.
జిల్లాల ఎస్పీలు వీరే..
శ్రీకాకుళం ఎస్పీగా జి.ఆర్.రాధిక
విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక
అనకాపల్లి ఎస్పీగా గౌతమి
పార్వతీపురం ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు
అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీష్‌కుమార్
కాకినాడ ఎస్పీగా ఎం.రవీంద్రనాథ్‌బాబు
కోనసీమ ఎస్పీగా సుబ్బారెడ్డి
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి
ప.గో. జిల్లా ఎస్పీగా యు.రవిప్రకాశ్
ఏలూరు ఎస్పీగా ఆర్.ఎన్. అమ్మిరెడ్డి
కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్
గుంటూరు ఆర్బన్ ఎస్పీగా ఆరీఫ్ హఫీజ్
పల్నాడు ఎస్పీగా వై.రవిశంకర్‌రెడ్డి
బాపట్ల ఎస్పీగా వకుల్ జిందాల్
ప్రకాశం ఎస్పీగా మల్లిక గార్గ్
నెల్లూరు ఎస్పీగా సీహెచ్ విజయరావు
తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి
చిత్తూరు ఎస్పీగా వై.రిషాంత్‌రెడ్డి
అన్నమయ్య జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు
కడప ఎస్పీగా అన్బూరాజన్
అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప
సత్యసాయి జిల్లా ఎస్పీగా రాజుల్‌దేవ్ సింగ్
కర్నూలు ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి
నంద్యాల ఎస్పీగా కె.రఘువీరారెడ్డి
విశాఖ పోలీస్ కమిషనర్‌గా సీహెచ్ శ్రీకాంత్
విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా
మొత్తం 26 జిల్లాల్లో 4 జిల్లాల పరిధిలో నాలుగేసి రెవెన్యూ డివిజన్లు.. 13 జిల్లాల పరిధిలో మూడేసి.. 9 జిల్లాల్లో రెండేసి డివిజన్లు ఉండనున్నాయి.
కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు :-
1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం
2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ
4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం
5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,
7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ
8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)
9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు
10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)
11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
13. ఎన్టీఆర్ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
14. గుంటూరు : గుంటూరు, తెనాలి
15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)
18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్ (కొత్త), నంద్యాల
21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్ (కొత్త)
22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)
23. వైఎస్సార్ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు
24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)
25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి
కొత్త జిల్లాలు – మండలాల సంఖ్య
శ్రీకాకుళం జిల్లా, 30 మండలాలు
విజయనగరం జిల్లా 27 మండలాలు
పార్వతీపురం మన్యం జిల్లా, 15 మండలాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాచ 22 మండలాలు
విశాఖపట్నం జిల్లా, 11 మండలాలు
అనకాపల్లి జిల్లా, 24 మండలాలు
కాకినాడ జిల్లా, 21 మండలాలు
కోనసీమ జిల్లా 22 మండలాలు
తూర్పుగోదావరి జిల్లా, 19 మండలాలు
పశ్చిమగోదావరి జిల్లా, 19 మండలాలు
ఏలూరు జిల్లా 28 మండలాలు
క్రిష్ణా జిల్లా, 25 మండలాలు
ఎన్టీఆర్ జిల్లా, 20 మండలాలు
గుంటూరు జిల్లా, 18 మండలాలు
బాపట్ల జిల్లా , 25 మండలాలు
పల్నాడు జిల్లా, 28 మండలాలు
ప్రకాశం జిల్లా, 38 మండలాలు
నెల్లూరు జిల్లా, 38 మండలాలు
కర్నూలు జిల్లా, 26 మండలాలు
నంద్యాల జిల్లా, 29 మండలాలు
అనంతపురం జిల్లా, 31 మండలాలు
శ్రీ సత్యసాయి జిల్లా, 32 మండలాలు
వైఎస్సార్ కడప జిల్లా ,36 మండలాలు
అన్నమ్మయ్య జిల్లా, 30 మండలాలు
చిత్తూరు జిల్లా , 31 మండలాలు
తిరుపతి జిల్లా, 34 మండలాలు