Cyclone Alert in AP: ఏపీకి తుఫాను ముప్పు, రేపటికి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, కోస్తా తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు
Rains (Photo Credits: PTI)

Amaravati, Sep 25: తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శుక్రవారం సాయంత్రం.. పూరీకి 590 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, కళింగపట్నానికి 740 కి.మీ. తూర్పుగా కేంద్రీకృతమై ఉంది. అటు తర్వాత శనివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారుతుందని, ఆదివారం నాటికి తుఫానుగా (IMD Issues Cyclone Alert) మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు (Cyclone Alert In Andhra Pradesh) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడనుంది. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనించనుంది. దీని ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

నెల్లూరు జిల్లాలో దారుణం, భార్య ఉరేసుకుంటుంటే భర్త ఆపకుండా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు, ఆ వీడియోని బంధువులకు పంపించి పైశాచికానందం పొందాడు

మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.