Heart Attack. (Photo Credits: Pixabay)

Palndau, April 17: పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పిడుగురాళ్ల పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌కు చెందిన ఓ ఎనిమిదివ తరగతి విద్యార్థి గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందాడు. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన మందా కోటేశ్వరరావు కుమారుడు కోటి స్వాములు పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఉంటూ ఇక్కడే జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

శనివారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్‌ సమయంలో కోటిస్వాములు తనకు ఊపిరి ఆడటం లేదని స్నేహితులకు చెప్పటంతో గాలి వీచే ప్రదేశంలో కూర్చోవాలని సూచించారు. వెంటనే గదిలోని ఫ్యాన్‌ కింద కూర్చునేందుకు వెళ్లి కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న నలుగురు స్నేహితులు కోటిస్వాములను లేపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వాచ్‌మన్‌కు సమాచారం అందించారు.

ఎండ దెబ్బకు 11 మంది మృతి, ఆస్పత్రిలో మరో 50 మంది, తీవ్ర విషాదంగా మారిన మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు ప్రదానోత్సవ సభ

వాచ్‌మన్‌ వచ్చి హాస్టల్‌ వార్డెన్‌కు తెలియజేయడంతో హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక పరీక్షలు చేసి కోటిస్వాములు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుత్తికొండలో ఉంటున్న బాలుడు తల్లిదండ్రులకు వార్డెన్‌ గోపీనాయక్‌ సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి హాస్పిటల్‌ వద్ద బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

కాగా 45 రోజుల్లో ఇది రెండో ఘటన. గత నెల మార్చి 7వ తేదీన ఇదే జిల్లాలోని పసుమూరు విలేజ్ లో ఫిరోజ్ అనే 17 ఏళ్ల కుర్రాడు గుండెపోటుతో మృతి చెందాడు. రాత్రి అన్నం తిన్న తరువాత ఫిరోజ్ నిద్ర పోతుండగా అర్థరాత్రి గుండెల్లో నొప్పి అంటూ విలవిలలాడాడు. కాసేపటికే సడన్ కార్డియాక్ అరెస్టుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.