విజయవాడ : ఏపీలోని విజయవాడలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టికెట్ ధరలు, అదనపు షోకు అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలోనే దీన్ని స్వాగతిస్తూ.. విజయవాడలో కృష్ణలంకకు చెందిన పవన్‌కల్యాణ్ అభిమానులు ‘హ్యాట్సాఫ్ సీఎం సార్’ అంటూ కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ ఫొటోలు ఉన్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 280 మందికి కరోనా, 4,709 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ ఫొటోతో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫొటోలు కూడా ముద్రించారు. మరోవైపు ఫ్లెక్సీపై వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ ఫొటోలు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. రాజకీయాలు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఓ సోదరుడిగా తనను ఆహ్వానిస్తేనే వచ్చానని తెలిపారు. మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఎందరో అభిమానుల్ని, క్రేజ్‌ని సంపాదిచుకువోవడం అసాధారణమైన విజయమని.. ఇది పవన్ కల్యాణ్ ఒక్కరికే సొంతమని కేటీఆర్ అన్నారు.