perni-nani vs pawan (photo-File Image)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ ముగ్గురు కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసిన సంగతి విదితమే. ఈ ములాఖత్‌పై పేర్ని నాని విమర్శల దాడి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఓదార్చడానికి పవన్‌ వెళ్లాడనుకున్నామని, చంద్రబాబుతో బేరం మాట్లాడ్డానికి వెళ్లాడా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుతో ములాఖత్‌ కాదు.. మిలాఖత్‌ అని తేలింది. బీజేపీతో పవన్‌ది తాత్కాలిక పొత్తు మాత్రమే తెలుగుదేశంతోనే పవన్‌కు శాశ్వతపొత్తు. పవన్‌కు క్లారిటీ ఉంది.. బీజేపీకే లేదు. బీజేపీ ఎప్పటికప్పుడు పిల్లిమొగ్గలు వేస్తోంది’’ అని పేర్ని నాని విమర్శలు గుప్పించారు.పవన్‌ పొత్తు పాతవార్తే.. ఇందులో కొత్తదనం లేదు. తెలుగుదేశంలో పార్టీలో పవన్‌ కల్యాణ్‌ అంతర్భాగం కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమే. చంద్రబాబుతో పవన్‌ వ్యాపారం మాట్లాడుకుని వచ్చాడా?. తన కార్యకర్తలకైనా పవన్‌ ఈ విషయం చెప్పాలి’’ అని పేర్ని నాని నిలదీశారు.

విడివిడిగా పోటీ చేస్తే జగన్‌ని ఆపలేం, అందుకే టీడీపీతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రిని ఓడిస్తాం, చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఇదిగో..

‘పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి డీల్ చేసుకుని వచ్చారు. ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా?. ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం?. అవినీతిపై పవన్ రాజీ లేని పోరాటం చేస్తానన్నాడు. మరి అవినీతిపరుడైన చంద్రబాబుకు ఎలా మద్దతు ప్రకటిస్తాడు. తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా?. లోకేష్‌తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా?. తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడు. సినిమాల్లోనే పవన్ హీరో... బయట మాత్రం జోకర్. 25 స్థానాలకు పవన్ అభ్యర్ధులను సప్లై చేస్తాడు’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.