Vijayawada,September 29: దసరా పండుగ రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆదాయార్జనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫ్లాట్ ఫాం టికెట్ల(Platform Ticket)ను ఒక్కసారిగా పెంచేసింది. ప్రయాణీకుల రద్దీ భారీగా ఉండే అవకాశముందని తెసుకోవడంతో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల ధరను రెండు రెట్లు పెంచింది. ఇప్పటి వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ. 10 గా ఉండగా దానిని రూ. 30 కి పెంచింది. ఈ పెంపు శనివారం నుంచే అమల్లోకి వచ్చింది. అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఆ తర్వాత మళ్ళీ యాథావిధి రేట్లు ఉంటాయి. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లలో ఈ పెంపు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వాటర్ కోచ్‌లో ప్రయాణించడం ఎలా? వాటర్ కోచ్ ప్రత్యేకతలు చూస్తే ఔరా అంటారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!
దక్షిణమధ్య రైల్వేలో ప్రధాన నగరాలైన విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరాల్లో ఆదివారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకూ ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకూ 10 రూపాయలు ఉన్న ఈ ధర ఆదివారం నుంచి రెండితలు పెరిగి రూ.30 అయింది. దీంతో ప్రస్తుత రేటుకు రూ.20 అదనంగా భారం పడనుంది. ప్రతి ఏటా ఇలా పెంచడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌కు రెండు గంటలు చెల్లుబాటు పరిమితిని విధించారు. ఆసక్తిర విషయం ఏమిటంటే రూ.10లతో ప్యాసింజరు టిక్కెట్ కొనుగోలు చేసి ప్లాట్‌ఫామ్‌పైకి వెళితే 3 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుంది. కాగా ప్రతి రోజూ ప్లాట్‌ఫామ్ టికెట్లను ఈ నగరాల్లో 2,500 విక్రయిస్తుండగా పండుగ రోజుల్లో 5000 వరకు విక్రయిస్తుంటారని తెలుస్తోంది. దీని ప్రకారం ఐదు వేల మంది ప్రయాణికులపై ఈ భారం పడనుంది. ఇదిలా ఉంటే గోదావరి రైల్వే స్టేషన్‌లో మాత్రం ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర మాత్రం రూ.10లు మాత్రమే ఉంటుందని రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ కల్యాణ్ తెలిపారు.