Amaravati, August 4: కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ (Prime Minister Kisan Samman Nidhi Yojana) ద్వారా అందిస్తున్న డబ్బులను మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో (Farmers Accounts) జమ చేయనుంది. ఆగస్ట్ నెల 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. మోదీ సర్కార్ రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన సమ్మాన్ నిధి స్కీమ్ (PM Kisan Yojana) ద్వారా వారికి ఏడాదికి రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధరామయ్యకు కరోనా, స్వీయ నిర్భంధంలోకి త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ డెబ్, దేశంలో తాజాగా 52,050 కేసులు నమోదు, 18,55,745కు పెరిగిన కోవిడ్-19 కేసుల సంఖ్య
మూడు విడతల రూపంలో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులు వచ్చి చేరతాయి. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరో విడత డబ్బులను ఆగస్టు 1 నుంచి లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలో కేంద్రం జమచేయనుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో..లేదో తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రాసెస్ ఇదే
ముందుకు కేంద్రం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ ను ఓపెన్ చేయాలి.
అందులో 'Farmer Corner' ఆప్సన్ క్లిక్ చేయాలి
ఆ తరువాత Beneficiary list కనిపిస్తుంది. అందులో మీరు పేరు, స్టేట్, జిల్లా, తాలూకా, గ్రామం వంటి వివరాలను నమోదు చేయాలి.
అవి నమోదు చేయగానే మీరు జాబితాలో ఉంటే మీ పేరు అక్కడ చూపిస్తుంది.