Polavaram Project: పోలవరంలో నీటి నిల్వపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం, తొలిదశలో 41.15 మీటర్ల మేరకే నీటిని నిల్వ చేస్తామని వెల్లడి
Polavaram Project(Photo-wikimedia commons)

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నీటి నిల్వపై కేంద్రం కీలక ప్రకటన (Central key Announcement) చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి (YCP MP Venkata Satyavathi) ఈరోజు లోక్ సభ (Lok Sabha)లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ (Prahladh Singh Patel) ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ పోలవరం, దాన్ని కొడుకుగా పూర్తి చేసేది నేనే, అసెంబ్లీలో సీఎం జగన్, ప్రధానిని కలిసింది కూడా ఈ ప్రాజెక్ట్ కోసమేనని వెల్లడి

తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా... అందులో కూడా జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు. మిగతావారికి సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.