Amaravati, Feb 7: చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి (President Kovind Chittoor Tour) ఏపీ సీఎంతో పాటు మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, సీఎం జగన్ (AP CM Jagan) మధ్య స్వల్ప చర్చ జరిగింది. కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని చిప్పిలి వెళ్లనున్నారు.
రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్‌సంగ్ ఆశ్రమానికి వెళ్లనున్నారు. అక్కడ సత్‌సంగ్ ఆశ్రమం, శంకుస్థాపన, భారత యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. సుప్రసిద్ధ తత్వవేత్త ముంతాజ్ అలీకి చెందిన సత్సంగ్ ఆశ్రమ సందర్శన కోసం కోవింద్ చిత్తూరు పర్యటనకు విచ్చేశారు.
సత్సంగ్ విద్యాలయంలో (Satsang Foundation) మొక్కలు నాటి, హీలింగ్ సెంటర్ కు భూమి పూజ చేస్తారు. ఆపై పీపల్ గ్రూప్ స్కూల్ కు చేరుకుని అక్కడి ఆవరణలో మొక్కలు నాటుతారు. స్కూల్ ఆడిటోరియంలో టీచర్లు, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం ఈ సాయంత్రం బెంగళూరు పయనమవుతారు.