AP CM Jagan mohan reddy (Photo-PTI)

New Delhi, June24: దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా (Presidential Polls 2022) తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. గత మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు (YSRCP supports NDA) మద్దతు తెలిపింది.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నందున ఆ రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పాల్గొననున్నారు. చీపురు పట్టి శివాలయాన్ని శుభ్రం చేసిన ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌపది ముర్ము, నేటి నుంచి సీఆర్పీఎఫ్ ద‌ళాలు భ‌ద‌త్ర, జెడ్ ప్ల‌స్ క్యాట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన కేంద్రం

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము (Draupadi Murmu) నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మొదటగా ప్రధాని మోదీ.. ముర్ము పేరును ప్రతిపాదిస్తారు. నామినేషన్‌ పత్రాలను 50 మంది ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంది.