
Hyderabad, April 4: హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయనగరం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (Orange Travels Bus) ప్రమాదానికి గురైంది. ఏలూరు (Eluru) జిల్లా దెందులూరు వద్ద ఈ తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 25 మంది ప్రయాణికులు, ముగ్గురు డ్రైవర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే దెందులూరు ఎస్సై వీరరాజు, హైవే పెట్రోలింగు పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిని నాలుగు అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బోల్తా పడడానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.