Covid in AP: ఏపీని వణికిస్తున్న సెకండ్ వేవ్, తాజాగా 19 వేల 412 మందికి కరోనా, ఒక్కరోజే 61 మంది మృతి, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 98 వేల 214 శాంపిల్స్ సేకరణ, తాజాగా 11,579 మంది డిశ్చార్జ్
Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Amaravati, May 1: ఏపీలో గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి (Corona In Andhrapradesh) కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 98 వేల 214 శాంపిల్స్ పరీక్షించగా..19 వేల 412 మంది కరోనా బారిన (Covid Report in AP) పడ్డారు.

గత 24 గంటల్లో కరోనా కారణంగా విజయనగరంలో ఎనిమిది మంది, విశాఖపట్టణంలో ఏడుగురు, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయారు.

గడిచిన 24 గంటల్లో 11 వేల 579 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 1,64,88,574 శాంపిల్స్ పరీక్షించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 11,18,207 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 79 వేల 402 మంది డిశ్చార్జ్ కాగా..8,053 మంది మృతి (Covid Deaths) చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

కర్నూలులో దారుణం, ఆక్సిజన్‌ అందక అయిదుగురు కరోనా పేషెంట్లు మృతి, అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ, సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,768 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2,679 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 2,048 కేసులు నమోదయ్యాయి. కడప, కృష్ణా, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 11,579 మంది కరోనా కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 61 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 8 మంది మరణించారు.

Here's AP Report

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 1772. చిత్తూరు 2768. ఈస్ట్ గోదావరి 2679. గుంటూరు 1750. వైఎస్ఆర్ కడప 792. కృష్ణా 694. కర్నూలు 1381. నెల్లూరు 1091. ప్రకాశం 1106. శ్రీకాకుళం 2048. విశాఖపట్టణం 1722. విజయనగరం 606. వెస్ట్ గోదావరి 1053. మొత్తం : 19,412.