Sabbam Hari (Photo-Facebook)

Amaravati, May 3: కరోనా మహమ్మారి బారినపడి మరో రాజకీయ ప్రముఖుడు తిరిగిరాని లోకాలకు (Sabbam Hari Dies) తరలి వెళ్లారు.మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Sabbam Hari Death) విడిచారు. గత నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు.

మూడో రోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అనంతరం వైద్యుల సలహామేరకు ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.

సబ్బం 1995 విశాఖ మేయర్ ఎన్నికల్లో పోటి చేశారు. అవినీతి ఆరోపణలు లేకుండా మేయర్‌గా పరిపాలన కొనసాగించారు. పారిశుద్ధ్యాన్ని ప్రైవేటీకరణ చేసిన తొలి నగరంగా విశాఖను సబ్బం హరి మలిచారు. విశాఖ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా.. అనంతరం నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా సబ్బం నియామకమయ్యారు.

హిందూపురంలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి, ఆందోళన చేపట్టిన మృతుల బంధువులు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు, ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

1970 అక్టోబర్ 15న లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సబ్బంకు అవని, అర్చన అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు వెంకట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. 15వ లోక్‌సభకు అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఈ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు.

Here's N Chandrababu Naidu Tweet

సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.