AP High Court: వాలంటీర్లు ఫోన్ల వాడకం పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు, ఎస్‌ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ కోర్టు గడప తొక్కిన ఏపీ ప్రభుత్వం, పురపాలక ఎన్నికలపై పిల్ కొట్టివేత
రానున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీ చేసిన ఆదేశాలను (SEC orders on ward volunteers ) సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో (AP High Court) విచారణ పూర్తయింది. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.
Amaravati, Mar 2: రానున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీ చేసిన ఆదేశాలను (SEC orders on ward volunteers ) సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో (AP High Court) విచారణ పూర్తయింది. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.
కాగా, వాలంటీర్ల సెల్‌ఫోన్లు స్వాధీనం (Volunteer CellPhones lunch motion petition) చేసుకోవాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అందుకు వాటిని రద్దు చేయాలని సవాలు చేస్తూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్‌జైన్ సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కమిషనర్ (SEC) ఆదేశాలను ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుతూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్‌జైన్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు నిన్న విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఎస్‌ఈసీ ఉత్తర్వులవల్ల పెన్షన్లు, నిత్యావసరాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు నిలిచిపోతుందన్నారు.
వాలంటీర్లకు రాజకీయాలతో సంబంధంలేదని, వారు స్వచ్ఛంద సేవకులని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని, అందువల్ల మున్సిపల్ ఎన్నికల్లో వారు పాల్గొనకుండా ఉత్తర్వులిచ్చామని ఎస్‌ఈసీ చెబుతున్నారని.. వాస్తవానికి వాలంటీర్లపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని శ్రీరామ్ తెలిపారు. నిర్దిష్టమైన ఆరోపణలుంటే చర్యలు తీసుకోవచ్చునని, అంతేతప్ప మొత్తం వాలంటీర్ల వ్యవస్థనే స్తంభింపజేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని ఆయన వివరించారు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తరువాత గ్రామస్థాయిలో సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగిందని ఏజీ తెలిపారు.
వాలంటీర్లు ప్రతీనెలా మొదటి తేదీన లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారని.. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఆదేశాలవల్ల పెన్షన్ అందజేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తనకు ఎలాంటి ఆదేశాలైనా ఇచ్చే అధికారాలున్నట్లు ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారని, ఈ భావన సరికాదన్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తానని కూడా కమిషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి వలంటీర్ల తొలగింపు అధికారం కమిషనర్‌కు లేదన్నారు. ఒకటో తేదీ పెన్షన్ మంజూరు చేసే రోజు అని, అందువల్ల పెన్షన్ మంజూరులో జోక్యం చేసుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును నేడు వెలువరిస్తామని తెలుపగా..తాజాగా తీర్పును రిజర్వులో ఉంచినట్లు తెలిపింది.
పురపాలక సంఘాల ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన రిట్ అప్పీల్స్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. మంగళవారం హైకోర్టులో విచారణకు రాగా.. సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఇప్పుడు కొనసాగించటం నిబంధనలకు విరద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. కోవిడ్ వలన సామాజిక మార్పులు జరిగాయని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం రిట్ అప్పీల్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని తెలిపింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
(The above story first appeared on LatestLY on Mar 02, 2021 06:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

