Andhra Pradesh December 10: గుంటూరు(Guntur) జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణానది(Krishna River)లో ఈత(Swimming)కు వెళ్లిన ఆరుగురు వేదపాఠశాల విద్యార్ధులు దుర్మరణం(Six students drowned) పాలయ్యారు. అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ స‌మీపంలోని శ్వేత శృంగాచ‌లం(Sweatha Srungachalam) వేద పాఠ‌శాల విద్యార్థులు న కృష్ణాన‌దిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. కానీ ఈత రాక‌పోవ‌డంతో నీట మునిగిపోయారు. సమాచారం అందుకుని అక్క‌డికి చేరుకున్న పోలీసులు గ‌జ ఈత‌గాళ్ల సాయంతో మృత‌దేహాల‌ను వెలికి తీశారు.

మృతుల‌ను హర్షిత్‌ శుక్లా, శుభమ్‌ త్రివేది, అన్షుమన్‌ శుక్లా, శివ శర్మ, నితేష్‌ కుమార్‌ దిక్షిత్ అని గుర్తించారు. మ‌రొక‌రిని గుర్తించాల్సి ఉంది. వీరు ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar paradesh), మధ్యప్రదేశ్(Madhya pradesh) రాష్ట్రాల విద్యార్థుల‌ని పోలీసులు తెలిపారు. న‌దిలో సుడి గుండాల వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు అంటున్నారు. ప్ర‌మాద స్థ‌లంలో క‌నీసం హెచ్చ‌రిక బోర్డులు లేవ‌ని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏపీ హోంమంత్రి సుచరిత(Sucharitha) వివ‌రాల‌ను తెలుసుకున్నారు. వేద పాఠశాల విద్యార్థులు చనిపోవడం అత్యంత బాధాక‌ర‌మ‌న్నారు. విద్యార్థుల కుటుంబసభ్యులకు ఆమె త‌న‌ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.

Andhra Pradesh: విషాదంగా ముగిసిన స్నేహితుల కథ, గుంటూరులో క్వారీ గుంతలో పడి గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యం, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి సుచరిత

విద్యార్ధుల మృతి దురదృష్టకరమ‌ని మంత్రి సురేశ్(Suresh) అన్నారు. సంఘటన పై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి సురేష్.. విద్యార్థుల మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు త‌న‌ ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.

అటుఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్(Governor Biswabhushan) దుర్ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందటం విచారకరమన్నారు. వారి కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో వివిధ సంస్థల యాజమాన్యాలు మరింత శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సూచించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.