Chandababu Naidu Credits: X

చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులోవాదనలు ముగిశాయి. తాజాగా ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ కోరింది. సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను బాబు తరపు న్యాయవాదులు ఉదహరించగా కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలను న్యాయమూర్తి అడిగారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున మరో పిటిషన్ దాఖలైంది.

చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై మరి కాసేపట్లో తీర్పు, ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, ఎవరేం వాదించారంటే..

సిట్ కార్యాలయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. సెక్షన్ 207 సీఆర్పీసీ ప్రకారం అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీపీ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదంటూ మండిపడ్డారు. వరుస పిటిషన్లు వేస్తే విధులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 లోపు పిటిషన్ దాఖలు చేయాలని తెలిపారు. నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినమని చెప్పడం సరికాదన్నారు.