Skill Development Scam: చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు సీరియస్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ మే 7కి వాయిదా, కోర్టులో రెడ్ బుక్ ప్రస్తావన
chandrababu (Photo-PTI)

Vjy, April 16: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను మే 7 వరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మంగళవారం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం విచారణ జరిపింది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాబు, ఆయన కుమారుడు లోకేష్‌ స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ‘దర్యాప్తుకు భంగం కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్‌బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్‌ అంటున్నారు.  రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా? కొల్లూరులో ప్రజాగళం సభలో సీఎం జగన్ మీద విరుచుకుపడిన చంద్రబాబు

ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. రెడ్‌బుక్‌ చంద్రబాబుకు ఇస్తారా అని లోకేష్‌ను ఆ టీవీ ఛానల్‌ ప్రతినిధి ఇంటర్వ్యూలో అడిగారు’ అని సీఐడీ వాదనలు వినిపించింది. పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. కాగా, గతేడాది స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే.