AP Assembly Session (photo-Video Grab)

Andhra Pradesh Assembly Budget Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి (Andhra Pradesh Assembly Budget Session) టీడీపీ సభ్యులు తమ నిరసనలతో సభకు ఆటంకం కలిగించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఏపీ అసెంబ్లీలో నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ తిరస్కరించారు.

దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు.వెంటనే స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం సభ పున:ప్రారంభమవగా..మళ్ళీ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. మళ్ళీ పోడియంపైకి వెళ్లి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు... బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు.

టీడీపీ సభ్యులు విజిల్ వీడియో 

దీంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేస్తున్నట్లు (Speaker Tammineni Sitaram suspended the TDP members) ప్రకటించారు. ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు.

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్

సభలో రెండో రోజు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పైకి పేపర్లు చించి వేసి విసిరేశారు. అసెంబ్లీలో ఈలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అబ్బయ్య చౌదరి.. ‘‘ఈలలు బయటకు వెళ్లి వేయండి’’ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

స్పీకర్‌పై టీడీపీ సభ్యులకు గౌరవం లేదు: అబ్బయ్య చౌదరి

తొడలు కొడితే కుర్చీరాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది

విలువలేకుండా ఏదో మాయ మాటలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి

పేదల కోసం ఆలోచించి, పేదల కోసం జీవించే ప్రభుత్వం మనది

పేదలకు అండగా ఉండాలనే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న సీఎం జగన్‌ చూసి చాలా ఆనందంగా ఉంది

నిజమైన నాయకుడు అనేవాడు ప్రజల అభివృద్ధిపైనే ఫోకస్‌ చేస్తాడు

అదే సీఎం జగన్‌ చేస్తున్నారు

అంబేద్కర్‌ను వ్యక్తిలా కాకుండా సిద్ధాంతంలా తీసుకుని ముందుకు వెళుతున్న నాయకుడు సీఎం జగన్‌

విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మార్చి పిల్లలకు మేనమామలా ఉన్న వ్యక్తి మనం సీఎం జగన్‌

హెల్త్‌ కేర్‌ను ప్రతీ పేదవాడికి అందిస్తున్న నాయకుడు సీఎం జగన్‌

ప్రతీ ఒక్కరికి హెల్త్‌ కేర్‌ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లోనే సాధ్యం కాలేదు.. కానీ పేదవారికి వైద్యం అందించాలనే ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్‌

ఆరోగ్యశ్రీని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది

జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో గొప్పది

ఆరోగ్యానికి పేదవాడి చేతిల్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టకూడదని ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్‌

ఈరోజు పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంటే అందుకు కారణం సీఎం జగన్‌

టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

పదే పదే స్పీకర్‌ కుర్చీ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం అనైతికం

ప్రజలకు తెలియ చేయాల్సిన విషయాలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు

టీడీపీ సభ్యులు సాక్షాత్తు స్పీకర్‌పై దాడి చేయడం విలువల్లేని రాజకీయాలకు నిదర్శనం

Here's Video

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దారిమళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోకి చొచ్చుకొచ్చిన సర్పంచులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. వారిని ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులు గాయపడ్డారు.