Nandyal, August 6: కర్నూలు జిల్లా నంద్యాలోని ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం (SPY Agro Industry Explosion) చోటు చేసుకుంది. ఆగ్రో ఫ్యాక్టరీలోని (agri-chemical industry)బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి (Nandyal Govt Hospital) తరలించగా, ముగ్గురు కార్మికుల్లో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మిగతా ఇద్దరు కార్మికులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు.
ఇటీవలే ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మెయిన్ టెనెన్స్ వర్క్స్ జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జనరల్ మేనేజర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఓ కమీటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వైజాగ్‌లో మరో పేలుడు, విజయశ్రీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, తప్పిన పెనుప్రమాదం
Here's Last time Explosion Video
Srinivas Rao, General manager of SPY Agro industries, died and three workers were affected as ammonia leaked from a 2ton tank at the company in kurnool district, #AndhraPradesh this noon.@MumbaiMirror @BangaloreMirror @ahmedabadmirror pic.twitter.com/Zsu5674rgo
— P Pavan (@pavanmirror) June 27, 2020
ఆ ఘటన మరువకముందే మళ్లీ ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.