
Srikakulam, Mar 30: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కోటబోమ్మాళి మండలం పాకీవలస వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న నేల బావిలో (Laguage van plunged into well) పడిపోయింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ మృతి (Srikakulam Road Accident) చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
బావిలో చిక్కుకుపోయిన డ్రైవర్, క్లీనర్ మృతదేహాలను పోలీసులు బావి నుంచి బయటకు తీశారు. మృతి చెందిన డ్రైవర్, క్లీనర్ ఒడిశాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లా జాతీయ రహదారి 65 మీదగట్టు భీమవరం టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, ఓ చిన్నారి మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీ ఒకసారిగా ఆగడంతో వెనుక వెళ్ళే బైక్ ఢీ ఢీకొట్టింది. బైక్ మీద భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు వెళ్తున్నారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, చిన్నపాప రోడ్డు మీద పడి అక్కడికక్కడే మృతి చెందగా... తల్లి, పెద్దపాపకు గాయాలయ్యాయి.
వెంటనే వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ వైపు నుండి సూర్యాపేట వైపు వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.