chandra babu, pawan kalyan (File)

Vijayawada, FEB 23: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన (TDP And Janasena) మధ్య పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం 11-40 గంటలకు ఉమ్మడి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కలిశారు. ఈ సందర్భంగా సీట్ల పంపకాలు, ఏ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే అంశంపై చర్చించారు.

Congress Chalo Secretariat Protest: షర్మిల అరెస్ట్, వెంటనే విడుదల, ఒక్కహామీని నెరవేర్చని జగన్ వైఎస్‌ఆర్‌ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని మండిపాటు 

ఇంకా బీజేపీతో పొత్తులపై చర్చలు కొనసాగుతుండటంతో పూర్తి జాబితా సిద్ధం కాలేదు. అయినప్పటికీ వేచి చూడకుండా తొలి జాబితాను ప్రకటించాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ భావించారు. ఈ క్రమంలోనే వివాదాలు లేని 60 నుంచి 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ముఖ్య నేతలు అందుబాటులో ఉండాలని టీడీపీ, జనసేన (TDP And Janasena) పార్టీలు సూచించాయి.