
Kurnool, May 24: కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన టీడీపీ, వైసీపీ ఘర్షణ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని (BC Janardhan Reddy Arrested) పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేయగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో జనార్ధన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని కూడా పోలీసులు అదుపులోకి (TDP Ex-MLA BC Janardhan Reddy Arrested) తీసుకున్నారు.
అర్ధరాత్రి జనార్ధన్ రెడ్డిని (BC Janardhan Reddy) అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను డోన్ తరలించినట్లు తెలుస్తోంది. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది.
విజయవాడలో ఉండే అడ్రస్‌ను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని, విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెల 23న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. జైల్లో ఉండగానే ధూళిపాళ్ల కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ధూళిపాళ్ల చికిత్స పొందుతున్నారు.