Amarawathi, March 03: గన్నవరం ఘటనలో టీడీపీ నేత పట్టాభితో (Pattabhi) పాటు మిగిలిన వారికి బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ, ఎస్టీ కోర్టు. కస్టడీ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం రూ.25వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 3 నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న ఆయనకు కోర్టులో ఊరట లభించింది. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం ఘటనలో పట్టాభితో పాటు మిగిలిన వారికి కూడా బెయిల్ ఇచ్చింది కోర్టు. బెయిల్ మంజూరు (conditional bail) చేసిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం పలు షరతులు విధించింది. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని స్పష్టం చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
పట్టాభి తదితరులను కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఇటీవల గన్నవరంలో టీడీపీ (TDP), వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. టీడీపీ ఆఫీస్ ఆవరణలో ఉన్న కారుకి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో, తనను కులం పేరుతో దూషించారంటూ సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత పట్టాభి తదితరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకున్న పట్టాభి.. టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ నేతలను రెచ్చగొట్టేలా వ్యవహరించడంతో పాటు కులం పేరుతో దూషించారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో పట్టాభితో పాటు 13మందికి కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు