Amaravati, Feb 6: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామా (Ganta Resign for MLA Post) చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన (TDP MLA Ganta Srinivasa Rao) ప్రకటించారు.
స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్ శనివారం లేఖ రాశారు.
మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ (Vizag steel plant) ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను చాటిచెప్పారు.
ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Here's Ganta Srinivasa Rao Tweets
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం నిర్ణయం తీసుకున్న వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఆ మేరకు లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. స్వయంగా లేఖ రాసి తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ కార్యదర్శి పంపించారు. pic.twitter.com/fNvbibHned
— apvarthalu.com (@apvarthalu) February 6, 2021
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం, మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస. మా నగరం పేరే ఉక్కు నగరం. pic.twitter.com/l0gg7gT3kk
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) February 5, 2021
కాబట్టి వెంటనే సొంత ఐరన్ మైన్ ని కేటాయించాలని మా డిమాండ్. అలా కాదని ముందుకెళ్తే ఢిల్లీ లో జరుగుతోన్న రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమాన్ని, తీవ్రతని చవిచూడాల్సి ఉంటుంది.
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) February 5, 2021
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పార్టీ విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. కాగా గంటా టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరతారనే వార్తలు వైరలయ్యాయి. కానీ వివిధ కారణాల వల్ల ఆ దిశగా అడుగులు పడలేదు. బీజేపీలో కూడా ఆయన చేరేందుకు చర్చలు జరుపుతున్నారంటూ వాదనలు తెరపైకి వచ్చాయి. కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు.