TDP MLC BTech Ravi (Photo-Twitter)

Pulivendula, Jan 4: టీడీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2018లో కడప జిల్లా పులివెందులలోని పూల అంగళ్ల వద్ద జరిగిన అల్లర్లకు (Pulivendula Riots Case) సంబంధించిన కేసులో నిన్న అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని (TDP MLC BTech Ravi) పోలీసులు ఈ ఉదయం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు ఆయనను పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో (Pulivendula Magistrate Court) హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

కాగా 2018 నాటి ఘర్షణ కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్టు కడప ఎస్పీ అన్బురాజన్ (Kadapa SP Anburajan) తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులో పలువురు బెయిలుపై ఉండగా, తాజాగా దర్యాప్తు నిమిత్తం బీటెక్ రవిని (మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. లింగాల మహిళ హత్య కేసుకు, అరెస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్‌ రవిపై వారెంట్‌ పెండింగ్‌లో ఉండింది.

మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న రామతీర్థం ఘటన, అక్కడ అసలేం జరిగింది? అప్రమత్తమైన ఏపీ సర్కారు, అన్ని దేవాలయాలకు జియో ట్యాగింగ్ చేస్తామని తెలిపిన డీజీపీ సవాంగ్, రామతీర్దంలో హై టెన్సన్

రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ అరెస్ట్‌ కాకుండా, బెయిల్‌ తీసుకోకుండా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో జరిగిన రాళ్ల దాడిలో ఎస్‌ఐ చిరంజీవికి గాయాలయ్యాయి. హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేథప్యంలో ఆదివారం చెన్నై విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి, ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పదవీ విరమణ చేసిన హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి రాకేష్ కుమార్

మరోవైపు, పోలీసుల తీరుపై బీటెక్ రవి మండిపడ్డారు. తాను అంతర్జాతీయ నేరస్తుడిని అయినట్టు వెంటాడి మరీ పట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. స్టేషన్‌కు రమ్మంటే తానే వచ్చే వాడినని అన్నారు. 2018లో కేసు నమోదైతే ఇప్పటి వరకు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. ఎస్సీ అయిన వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.