Harish Rao vs Revanth Reddy (Photo-Video Grab)

Harish Rao vs Revanth Reddy on Kaleswaram: తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (BRS MLA Harish Rao) మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామన్నారు. ‘‘మీ విజ్ఞతను వినియోగించి సంపదను సమకూర్చుకోండి.. కానీ మా మీద నెపం నెట్టి తప్పించుకోకండి. రాష్ట్ర పరపతిని దిగజార్చకండి. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయకండి’’ అంటూ హరీష్‌రావు హితవుపలికారు.

తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ, 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం, పీఏసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. హరీష్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హరీష్ రావు మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి, రెండో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. గత పదేళ్లలో నీటిపారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.97,449 లోన్ మంజూరు అయితే విడుదల అయింది రూ.79, 287కోట్లు. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు కాకుండా ఇంకా నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 80వేల కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు నిధులు వేరే వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను అమ్మేందుకు గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాళేశ్వరం నీళ్ళు అమ్ముతామని రూ.5,100 కోట్ల అప్పులు చేశారు. 2014కు ముందు తెలంగాణ ప్రజలు మంచినీళ్ళు, ఇళ్లలో నల్లా కనెక్షన్లు ఉన్నట్లు గత ప్రభుత్వం చెప్తోంది. మిషన్ భగీరథపై రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందని బ్యాంకులను మభ్యపెట్టి లోన్స్ తెచ్చారు.

నీళ్ళపై వ్యాపారం చేసి కాళేశ్వరంపై రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథపై రూ.5వేల కోట్లు అప్పులు తెచ్చారు. TSIICకి వచ్చిన లోన్ నిధులకు ప్రభుత్వమే బాధ్యత అని గ్యారెంటీ ఇచ్చారు. అప్పుల కోసం ఆదాయం తప్పుగా చుపించిందంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. తన పద్ధతి మార్చుకోవాలంటూ కాగ్‌ గత ప్రభుత్వానికి హెచ్చరించింది.శాసన సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు మాట్లాడితే చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్‌ చేశారు.