Amaravati,Mar 24: పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దెందులూరులోని సింగవరం గ్రామంలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య (Family Committed Suicide) చేసుకుంది. ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలీదు గానీ వారంతా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (Family Committed Suicide, West Godavari ) పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దెందులూరు మండలం సింగవరం లో నివసిస్తున్న భార్యాభర్తలు వెంకట నారాయణ, కృష్ణ తులసి , వారి కొడుకు భాను వికాస్ తమ పంట పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అక్కడ తండ్రి చనిపోగా, కొన ఉపిరితో ఉన్న కుమారుడుని, అతని భార్యని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే కొడుకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం కృష్ణ తులసికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామస్థులను విచారిస్తున్నారు.
ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా బెదిరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఏది ఏమైనా ఈ కుటుంబం ఇలా చేయడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు.