Road accident (image use for representational)

Guntur, Feb 24: గుంటూరు జిల్లాలొ ఘోర రోడ్డు ప్రమాదం (Vinukonda Road Mishap)చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురి బతుకులు తెల్లారిపోగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారు జామున గుంటూరు జిల్లా వినుకొండ రూరల్‌ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద ఓ మినీ లారీ అదుపుతప్పి చెట్టును బలంగా (Three killed in road mishap in Guntur) ఢీకొట్టింది.

ఘటన వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని పార్లపలి, మాసుమాను దొడ్డి, కొసిగి, పల్లెపాడు గ్రామాల నుంచి సోమవారం రాత్రి గుంటూరు జిల్లాకు సుమారు 100 మందికి పైగా వలస కూలీలు నాలుగు మినీ లారీల్లో బయలు దేరారు. యడ్లపాడు, పెదనందిపాడు ప్రాంతాల్లో మిర్చి, వేరుశనగ పొలాల్లో కూలి పనుల కోసం వీరంతా వస్తున్నారు.

వీరిలో మాసుమానుదొడ్డి గ్రామానికి చెందిన కూలీలతో బయలుదేరిన మినీ లారీ అందుగుల కొత్తపాలెం గ్రామ శివారులోని లక్ష్మక్క వాగు బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఘటనలో భీముడు, యర్నాల శ్రీనివాసరావు, వాహనం యజమాని, డ్రైవర్‌ బొంతల ఉమేష్‌కుమార్‌ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల 108 వాహన సిబ్బంది సకాలంలో స్పందించి గాయపడ్డ వారిని పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఘోర విషాదం..ఆ 134 మంది చనిపోయినట్లే, ఉత్తరాఖండ్ మెరుపు వరదల్లో గల్లంతయిన వారిని ‘మరణించినట్టుగా భావిస్తున్నట్టు’ ప్రకటించిన ప్రభుత్వం, మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృత దేహాలతో పాటు గాయపడిన వారిని బయటకు తీసి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమ సహచరుల వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మిగతా వలస కూలీలు భారీగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. వారందరినీ స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.