Tirumala: వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం, శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు, సామాన్య భక్తులకే కేటాయించాలని నిర్ణయం
Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

Tirumala., Feb 25: వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం​ తీసుకుంది. శని, ఆదివారాల్లో (Saturday and sunday) వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు (TTD cancels VIP break darshan system) చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధ‌రించి కల్పవృక్ష వాహనంపై ద‌ర్శన‌మిచ్చారు. కొవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవను ఏకాంతంగా నిర్వహించారు.

అనంతరం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ‌ర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేపట్టారు. వాహన సేవలో జేఈవో వీర‌బ్రహ్మం దంప‌తులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగ‌ల్రాయులు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచిన టీటీడీ, అద‌నపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడు‌దల

శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ పెంచింది. ఈ నెల 24 నుంచి అద‌నపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడు‌దల చేయ‌ను‌న్నట్టు వెల్లడించింది. మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికె‌ట్లను రోజుకు 25 వేలకు పెంచింది. దీంతో మార్చి నెల సర్వద‌ర్శన టికె‌ట్లను రోజుకు 20 వేలకు పెంచిన టీటీడీ, నిత్యం 5 వేల చొప్పున అద‌నపు కోటా కింద జారీ చేయ‌ను‌న్నది. తిరు‌ప‌తి‌లోని భూదేవి, శ్రీని‌వాసం కాంప్లె‌క్సులు, శ్రీగో‌విం‌ద‌రా‌జ‌స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంట‌ర్లలో టికె‌ట్లను జారీ‌చే‌య‌ను‌న్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీలోని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఏపీ వ్యాప్తంగా 96 ప్రముఖ శైవ క్షేత్రాలకు 3200 బస్సులు, కోటప్పకొండ తిరునాళ్ళకి జిల్లా నలుమూలల నుంచి 410 బస్సులు అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించారు.