Tirumala, Jan 9: తిరుమల (Tirumala) వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో (Stampede Update) ఆరుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. తొక్కిసలాట ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తాజాగా స్పందించారు. గేట్ సడెన్ గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే, ఘటనకు గల కారణాలను లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
Here's Video:
తొక్కిసలాట ఘటనపై స్పందించిన తిరుపతి జిల్లా కలెక్టర్
గేట్ సడెన్ గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు
ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది
మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఉన్నారు
మిగతా వారు వైజాగ్, నర్సీపట్నం కు చెందిన… pic.twitter.com/EOm0aSDpsS
— BIG TV Breaking News (@bigtvtelugu) January 9, 2025
క్షతగాత్రులు ఇలా..
మరణించిన వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఉన్నారని, మిగతా వారు వైజాగ్, నర్సీపట్నం కు చెందిన వారుగా గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చినట్టు కలెక్టర్ వెల్లడించారు. 35 మంది క్షతగాత్రులకు రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్టు వివరించారు.