Lord Hanuman Birth Place: తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం, ఆంజనేయుని జన్మస్థానంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ, వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపిన జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధరశర్మ
charya Muralidhar Sharma, Vice Chancellor National Sanskrit University (Photo-Video Grab)

Tirumala, April 21: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమలే హనుమంతుని జన్మస్థానమని..దీనిని ఆధారాలతో సహా రామనవమి రోజు ప్రకటిస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) ప్రకటించిన సంగతి విదితమే. కాగా నేడు హన్మంతుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధారాలను (TTD Released Proofs on Lord Hanuman Birth Place) ప్రకటించింది. ఆంజనేయుని జన్మస్థలానికి సంబంధించిన పలు ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధరశర్మ (Acharya Muralidhar Sharma, Vice Chancellor National Sanskrit University) వెల్లడించారు.

ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలోని అంజనాద్రే హన్మంతుని జన్మస్థలం (Lord Hanuman, Birth Place) స్పష్టం చేశారు. హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నామని, ఆంజనేయుని జన్మస్థలంపై అన్వేషణ కొనసాగిందని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించామని వివరించారు. వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని తెలిపారు. పౌరాణిక, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపారు.

ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం మూసివేత, భక్తులు లేకుండా ఏకాంతంగా కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, మే 15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ

కాగా త్రేతాయుగంలో వేంకటాచలాన్ని అంజనాద్రిగా పిలిచారని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. అంజనాద్రికి హనుమ పుట్టాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని పేర్కొన్నారు. అంజనాదేవికి హన్మంతుడు ఇక్కడ పుట్టడం వల్లే అంజనాద్రి అని పేరు వచ్చిందని తెలిపారు. అంజనాద్రిలో పుట్టి వేంకటేశ్వరస్వామికి ఆంజనేయుడు సేవ చేశాడని చెప్పారు. కర్ణాటకలోని హంపి హన్మంతుడి జన్మస్థలం కాదని తెలిపారు. హంపి కాదని చెప్పడానికి తమ వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆచార్య మురళీధరశర్మ స్పష్టం చేశారు. అయితే బల్లారి సమీపంలోని హంపిని 'కిష్కింధ క్షేత్రం' లేదా కోతి రాజ్యంగా చాలామంది భావిస్తారు.

భక్తులు లేకుండా భద్రాద్రి సీతారాముల కల్యాణం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు

సూర్యబింబం కోసం హనుమ వేంకటగిరి నుంచే గాల్లోకి ఎగిరాడని తెలిపారు. హనుమ తిరుమల కొండల్లోనే పుట్టాడని 12 పురాణాలు చెబుతున్నాయి పేర్కొన్నారు. 12, 13వ శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని తెలిపారు. వాల్మీకి రామాయణం తర్జుమా కంబరామాయణంలోనూ ఈ ప్రస్తావన ఉన్నట్లు స్పష్టం చేశారు. అన్నమయ్య కీర్తనల్లో వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారని ఆచార్య మురళీధరశర్మ వివరించారు.

కాగా అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకుగాను గతేడాది డిసెంబర్‌లో పండితులతో టీటీడీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్‌సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెంత ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం, తేదీ ప్రకారం నిర్థారించిన అంశాలను కమిటీ సభ్యులుటీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డికు వివరించారు.