Visakhapatnam, Feb 27: పెట్టుబడులకు (Investments) రాజధానిగా ఏపీ (AP) మారుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం ఐటీ వర్క్ ఫోర్స్.. సాఫ్ట్ వేర్ రంగంలో కొత్త పెట్టుబడులకు ఆశావహంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాలు ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాలకు కూడా తక్కువ సమయంలోనే చేరుకొనే వెసులుబాటు కల్పిస్తున్నది. ఈ సదుపాయాలు రాష్ట్రంలో పెట్టుబడులకు మార్గంగా మారనున్నాయి. కాగా, గడిచిన మూడేండ్లలో ఇప్పటికే రాష్ట్రంలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీలను ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు వచ్చే నెల 3, 4 తేదీల్లో ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు (Global Investor Summit) కు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గేట్ వే ఆఫ్ ఈస్ట్ గా ఏపీ.. పెట్టుబడులకు సరైన కేంద్రం.. ఎలాగంటే??
ఏపీలో పెట్టుబడులకు అనువైన రంగాలు: ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్, అగ్రి అండ్ పుడ్ ప్రాసెసింగ్, ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు, హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రో కెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, టెక్స్టైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి
కాంగ్రెస్ పార్టీలో ముగిసిన సోనియా శకం, క్రియాశీల రాజకీయాల నుంచి సోనియాగాంధీ రిటైర్మెంట్ ప్రకటన