Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులు నేటితో పూర్తి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు నిర్మించి చరిత్ర సృష్టించిన జగన్ సర్కారు
Veligonda Project (Photo-X)

Prakasam, Jan 24: ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని ప్రాంతాలకు నీరు అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) రెండవ సొరంగం పనులు పూర్తి చేశారు.ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెండవ సొరంగం వద్ద ఏంఇఐఎల్‌ కంపెనీ కార్మికులు విజయం సాధించినట్లు బేనర్‌ తో ప్రదర్శన చేశారు. జలవనరుల శాఖ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం వచ్చే సీజన్‌ నాటికి సొరంగం నుండి కృష్ణా జలాలను రిజర్వాయర్‌ కు చేర్చనున్నారు.

కాగా వెలిగొండ ప్రాజెక్ట్ (Veligonda 2nd Tunnel Completed) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపూర్‌లో ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, కృష్ణా నది నుండి 43.5 TMC వరద నీటిని మళ్లించడం ద్వారా ప్రకాశం జిల్లా , నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్, కరువు ప్రభావిత ప్రాంతాల్లోని 29 మండలాల్లో 459,000 ఎకరాలకు సాగునీరు మరియు 1.5 మిలియన్ల ప్రజలకు త్రాగునీరు అందించబడుతుంది.

నేటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తుల స్వీకరణ, కాంగ్రెస్ మాజీలకే పెద్దపీట వేసే అవకాశం

కొల్లంవాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్‌ ముంగిట నుంచి నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌లో నిల్వ చేసేందుకు ప్రతిపాదించారు. నల్లమల కొండల మీదుగా 18.8 కి.మీ పొడవునా రెండు సొరంగాల ద్వారా ఈ ప్రాజెక్టుకు నీటిని లాగుతున్నారు.ప్రాజెక్ట్ పేరు "పూల సుబ్బయ్య ఇరిగేషన్ ప్రాజెక్ట్" గా మార్చబడింది. 2004, అక్టోబర్‌ 27న అవిభాజ్య ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా.. 23 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్‌ ఛానల్‌ పనులనూ చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్‌ పనులను చేపట్టారు.

జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ ఎజెండా, చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు స్టార్ క్యాంపెయినర్లు తెగ కష్టపడుతున్నారని సెటైర్లు

ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు 2021 జనవరి 13న పూర్తి కాగా, రెండో సొరంగం పనులు ఇవాళ పూర్తి అయ్యాయి. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కి.మీల తవ్వకం పనులు పూర్తి కాగా మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసినట్లు తెలిపారు. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌ ఇప్పటికే పూర్తి చేశారు.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తి చేశారు.. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం అయినట్టు అవుతుది.. మూడు జిల్లాల పరిధిలోని (ప్రకాశం, నెల్లూరు, కడప) 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి నలమల అటవీమార్గంలో దోర్నాల వద్ద కొత్తూరు రిజర్వాయర్‌ కు నీటిని తరలించేందుకు రెండు సొరంగాలు తవ్వేందుకు ప్రాజెక్టులో రూపకల్పన చేశారు. వీటిలో మొదటి సొరంగం 3.6 డ. మీ. వెడల్పు , పొడవు 18.82 కి.మీ. నుండి 3వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. ఇది 2021లోనే పూర్తయింది . రెండవ సొరంగం 7.5 డి.మీ. వెడల్పు, పొడవు 18.82 కి.మీ నుండి 8500 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. 15 సంవత్సరాల క్రితం మొదలైన సొరంగం పనులు మొదటి సొరంగం పూర్తి చేసేందుకు 12 సంవత్సరాలు పట్టింది.రెండవ సొరంగం పనులను రికార్డు సమయంలో మెగా సంస్థ పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు సాగు, త్రాగునీరు అందించడం ప్రాజెక్టు లక్ష్యం. ప్రకాశం జిల్లా లోని 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా 80వేల ఎకరాలు, కడప జిల్లా 30వేల ఎకరాలు సాగు నీరు అందించే లక్ష్యం. 3జిల్లాలలోని 30 మండలాలలోని 16లక్షల మందికి త్రాగునీరు అందించడం ప్రధాన లక్ష్యం. సహజ సిద్ధమైన రిజర్వాయర్‌ ఏర్పాటుకు కాకర్ల గ్యాప్‌, సుంకేసుల గ్యాప్‌ లు పూర్తయ్యాయి. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి వారిని తరలించడమే ప్రభుత్వం ముందున్న అసలైన పని.

ఈ ప్రాజెక్టు అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్య ప్రాణులకు సైతం ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నా­మని నిర్మాణ సంస్థ మేనేజర్‌ పి.రాంబాబు తెలిపారు. అలాగే, కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సహకారంతో పనులు చేపట్టామని ఆయన చెప్పారు. జలవనరుల శాఖ ఈఈ పురార్ధనరెడ్డి వెలిగొండ టన్నెల్‌ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్లో నీటిని ఈ సొరంగాల ద్వారా విడుదల చేస్తామని చెప్పారు.