మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రా ఏపీలో చంద్రబాబు కేసుతో బిజీగా ఉండటంతో అందుబాటులో లేకుండా పోయారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపిన సునీతారెడ్డి.. కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు.
దీంతో ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బెయిల్ రద్దు పిటిషన్ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ ఈ ఏడాది మేలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కొన్ని అనివార్య కారణాల రీత్యా కేసు విచారణను వాయిదా వేయాలని సునీత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. ఆ తర్వాత నాన్ మిస్లేనియస్ డే రోజు విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.