Representational Image | (Photo Credits: PTI)

VJY, Dec 23: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. నైరుతి & ప్రక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర అల్ప పీడన ప్రాంతం ఉత్తర వాయువ్య దిశగా కదిలి, గురువారం ఉదయం వాయుగుండంగా (Cyclone) మారింది.

నైరుతికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతానికి సమీపంలో శ్రీలంకకి తూర్పు ఈశాన్యంగా 420 కిమీ దూరంలో, నాగపట్టణం (Tamil Nadu) కి దక్షిణ ఆగ్నేయ దిశగా 600 కిమీ, చెన్నై (తమిళనాడు)కి ఆగ్నేయంగా 690 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తదుపరి 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా వంపు తిరిగి శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉంది.దీని ప్రభావం ఏపీపై మాత్రం దక్షిణ కోస్తాపైనే ఉంటుందని వివరించారు.

పోలవరంపై కేంద్రం శుభవార్త, రూ.5,036 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సీడబ్ల్యూసీ సిఫార్సు

కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్రలో వర్షాలు ( Rains to hit TN and Costal Andhra) కురవనున్నాయి.ఏపీ మీదుగా వీస్తున్న ఈశాన్య, ఆగ్నే­య గాలులు వల్ల రాష్ట్రంలో పొగమంచు పెరుగుతుందని అధికారులు చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోతాయని చెప్పారు. వచ్చే రెండు రోజులు రాష్ట్రం­లో మిగతా చోట్ల పొడి వాతావరణ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉం­ద­ని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

మరో మూడు రోజులు వరకు విపరీతమైన చలి కాలాన్ని చూసే అవకాశాన్ని ఈ వాయుగుండం ఇవ్వనుంది. అటు విశాఖ నగరం తీసుకున్నా, ఇటు విజయవాడ​, గోదావరి జిల్లాలు తీసుకున్నా, అటు రాయలసీమ తీసుకున్నా, చాలా చోట్లల్లో చలి తీవ్రత 14-17 డిగ్రీల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద­యం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.

 ఏపీలో విద్యా విప్లవం, 4,59,564 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం, 59,176 మంది టీచర్లకు బోధనకు సాయపడేలా ఉచిత ట్యాబ్‌ల పంపిణీ

అరకు వ్యాలీలో సున్నాకు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి. అలాగే మారేడుమిల్లి ప్రాంతం, విజయనగరం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం కాస్త వెచ్చగా ఉండనుంది. ఎందుకంటే మనకు సముద్రం నుంచి తేమ గాలులు వస్తుంటాయి. ఇక ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా ఆంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని వలన మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది