heavy-rainfall-warning-to-telangana(Photo-ANI)

Amaravati, July 15: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల‌పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains Alert) ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్ర‌స్తుతం ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీట‌ర్ల నుంచి నుంచి 7.6 కి.మి. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్‌ జోన్‌) ప్రభావంతో ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు, ఇందుకోసం నాలుగేళ్లలో రూ. 6163.59 కోట్లు కేటాయింపు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

కాగా నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో మ‌రో రెండు మూడు రోజుల‌పాటు రాష్ర్ట వ్యాప్తంగా తేలిక‌పాటి నుంచి ఓ మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (Vizag Weather Forecast) వెల్ల‌డించింది. ఇప్ప‌టికే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మ‌రో రెండు రోజుల‌పాటు రాష్ర్ట వ్యాప్తంగా చాలాచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరువూరులో 17 సెం.మీ, విశాఖపట్నంలో 10 సెం.మీ, చోడవరంలో 8 సెం.మీ, ధవళేశ్వరంలో 7 సెం,మీ, పిడుగురాళ్ల, తణుకు, కందుకూరులో 6 సెం.మీ, బద్వేల్, ఆత్మకూరు, అవనిగడ్డ, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, సంతమాగులూరు, బొబ్బిలిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఈ రోజు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అచ్చంపేటలో రోడ్ల పైకి నీరు చేరుకుంది. లో లెవల్ చప్టాలపై నుంచి నీరు ప్రవహిస్తోంది