Amaravathi, July 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి, అయితే రోజురోజుకి వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా తగ్గిస్తుండటం గమనార్హం. గతంలో సుమారు లక్షకు పైగా నిర్వహించే టెస్టులు ఇప్పుడు దాదాపు సగానికి తగ్గిపోయాయి. ఏదైమైనా రాష్ట్రంలో కేసులు అదుపులోకి రావటం మంచి పరిణామంగా చెప్పవచ్చు. అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుండటంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూపోతుంది. ప్రజల సహాకారం ఉంటే, రాబోయే థర్డ్ వేవ్ ను కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 65,920 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 1,747 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19,50,339కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,47,444 గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 293 కోవిడ్ కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లా నుంచి 234, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 215, ప్రకాశం 223 మరియు నెల్లూరు నుంచి 239 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 14 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,223కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 2,365 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,14,177 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 22,939 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.