Amaravati, June 30: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో గల ఏపీ టూరిజం హోటల్‌లో (AP tourism hotel) మాస్క్ ధరించాలని సూచించిన కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి (AP Tourism Hotel Violence) చేసిన విషయం మీద హోం మంత్రి సుచరిత (AP Home minister) స్పందించారు. మహిళా ఉద్యోగినిపై దాడి జరగడం బాధాకరం అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఆ కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించామని ఆమె తెలిపారు. రేపే 108, 104 సర్వీసులు ప్రారంభం, అత్యాధునికంగా తీర్చిదిద్దిన 1068 అంబులెన్సులను లాంచ్ చేయనున్న ఏపీ సీఎం వైయస్ జగన్
మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. త్వరితగతిన ముద్దాయిలకు శిక్ష పడేలా దిశ చట్టం రూపొందించడం జరిగిందన్నారు. దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వన్ స్టాప్ సెంటర్లను బలోపేతం చేశామని ఆమె చెప్పుకొచ్చారు. నేరం చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరులో జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని హోంమంత్రి సుచరిత తెలిపారు. రానున్న రోజుల్లో దిశ చట్టం మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు.
Here's Attack and Arrest Video
Deputy manager #AP Tourism hotel, #Nellore, who assaulted woman employee who asked him to wear a mask, has been suspended & charged under sections 324, 354 & 355 IPC; after covid19 test result, to be presented before magistrate & then sent to jail, following covid protocol @ndtv pic.twitter.com/fPqWjvhlxZ
— Uma Sudhir (@umasudhir) June 30, 2020
దిశ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో గుంటూరులో యువతిపై అత్యాచారం ఘటనపైనా ఆమె స్పందించారు. గుంటూరులో యువతి వీడియోలను నెట్‌లో పెట్టిన కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు. మూడో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. పోలీసులకు చెందిన వారే కాదు.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని సుచరిత హెచ్చరించారు.
కరోనా నేపథ్యంలో ఉద్యోగులంతా మాస్కులు ధరించాలని ఆదేశాలు ఏపీ టూరిజం అధికారులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులంతా మాస్కులు ధరించగా, డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాలని మహిళా ఉద్యోగి ఉషారాణి సూచించగా, తనకే సలహాలు ఇస్తావా అంటూ ఆమెపై దాడి చేశారు. సహచర ఉద్యోగులు కలుగజేసుకొని ఆయనను బయటకు పంపించేశారు. అనంతరం బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సీసీ పుటేజీని (CCTV footage) కూడా పోలీసులకు అందించారు.