Hyd, Jan 3: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు... పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యనించారు. కొంత కాలంగా సోదరుడు జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. మొన్న పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్త గుప్పుమంది. అయితే న్యూ ఇయర్ రోజున షర్మిల జగన్ ఇంటికి వెళ్లడంతో ఈ వార్తలు తుస్సుమన్నాయి.
తాజాగా ఏపీలో పార్టీ పెడతారా అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల వ్యూహాత్మకంగా సమాధానం (YS sharmila Interesting comments ) ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. తామొక మార్గాన్ని ఎంచుకున్నామని, ఈనెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రైతు ఆవేదన యాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారని, కరోనా నిబంధనలు పాటిస్తామంటున్నా అనుమతి ఇవ్వడం లేదన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం నిబంధనలు అడ్డురావా? అన్ని ప్రశ్నించారు. నిబంధనల వంకతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని షర్మిల మండిపడ్డారు.