CM Jagan Mohan Reddy (photo-X/YCP)

Vijayanagaram, April 23: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచించడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని దుయ్యబట్టారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయన్నారు.  జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ పారిపోయాడు, చంద్రబాబు సంకలో పిల్లి ఈ పవన్ కళ్యాణ్ అంటూ కాకినాడలో విరుచుకుపడిన సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్‌ ఉన్నాయన్నారు. ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్‌ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ఎన్నికలప్పుడు కూటమి నమ్మించి మోసం చేస్తుందని మండిపడ్డారు సీఎం జగన్‌. నమ్మించి మోసం చేసిన కూటమి నేతల్ని 420 అంటారని అన్నారు. చంద్రబాబు వెనక దత్తపుత్రుడు ఉన్నాడని అన్నారు. ఓవైపు జగన్‌ ఒక్కడే అయితే మరోవైపు తోడేళ్లు ఏకమయ్యాయని విమర్శించారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు మీరంతా సిద్ధమా?..చంద్రబాబుబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమా? అంటూ చెల్లూరు సభకు హాజరైన జనవాహినిని ఉద్ధేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు.